సంచలన దర్శకుడు గాడ్ సెక్స్ ట్రూత్ సినిమా రామ్ గోపాల్ వర్మకు అనుకోని కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సామాజిక కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసు విచారణను ఎదుర్కుంటున్న వర్మకు తాజాగా మరో వివాదం మెడకు చుట్టుకోనుందేమో అనిపిస్తోంది. పోర్న్, న్యూడ్ ఫిలిం జీఎస్టీని వర్మ హైదరాబాద్‌లో తెరకెక్కించాడనే మరో వివాదం వర్మకు చుట్టుకుంది. తను ఇప్పటి వరకూ జీఎస్టీని యూరప్‌లో షూటింగ్ చేశానని చెప్పుకొచ్చారు వర్మ.
ఆ సినిమాను హైదరాబాద్‌లో తెరకెక్కించారని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. మియా మాల్కోవా కూడా హైదరాబాద్ వచ్చిందని.. అందుకు తమ వద్ద ఆధారాలున్నారని కథనంలో పేర్కొన్నారు. ఈ సినిమాను హైదరాబాద్‌లో ఓ హోటల్లో షూటింగ్ చేశారని తెలిపింది. ఇదే నిజమైతే ఆ హోటల్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇండియాలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. అలాంటిది వర్మ ఆ న్యూడ్ సినిమాను నిజంగా హైదరాబాద్‌లో తీసుంటే… అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.