మిచిగాన్ నగరానికి చెందిన మాజీ మోడల్ అయిన అందాల రాణి లౌరెన్ స్టూర్ట్ దారుణానికి పాల్పడింది. మాజీ మోడల్ అయిన లౌరెన్ స్టూర్ట్ తన భర్త డేనియల్ (42), కుమారుడు స్టీవెన్ (27), కూతురు బేతానీ (24)లను కాల్చి చంపింది. అనంతరం తాను పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంచలనం రేపింది. ఆమె పెంపుడు కుక్క కళేబరం కూడా బాత్ టబ్ లో  పడి ఉంది. ఒత్తిడి, నిర్వేదంతోనే లౌరెన్ స్టూర్ట్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు. అసలు ఈ సంఘటనకు కారణాలేమిటో తెలియరాలేదు. పోలీసులు వచ్చి సంఘటన స్థలంలోని మృతదేహాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.మొత్తంమీద ఈ ఘటన మిచిగాన్ నగరంలో సంచలనం రేపింది.