• మోదుగ గింజలను నూరి లేపనంగా వేస్తే తెల్ల మచ్చలు (ల్యూకోడెర్మా), తామర (రింగ్‌వార్మ్‌) వ్యాధి తగ్గిపోతాయి.
  •  తాజా మోదుగ చెక్క రసాన్ని పూస్తే తెగిన గాయాలు తొందరగా మానతాయి.
  •  మోదుగ పూలను రాత్రివేళ చల్లటి నీటిలో నాన బెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిలో పటిక బెల్లం కలిపి తాగుతూ ఉంటే, మూత్రం మార్గం వెంట రక్తం పడటం తగ్గిపోతుంది.
  •  మోదుగ పూలను మెత్తగా నూరి పట్టిస్తే, దెబ్బలు, వాపులు తగ్గుతాయి.
  • మోదుగ పూలను ఉడి కి ంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు బొడ్డు పైన లేపనంగా వేస్తే మూత్రం సాఫీగా వెళుతుంది.
  •  మోదుగ వేరు పట్టను దంచి పాలతో కలిపి ప్రతి రోజూ తాగుతూ ఉంటే, లైంగిక శక్తి పెరుగుతుంది.
  • మోదుగ గింజలను మెత్తగా నూరి ఆ ముద్దను బియ్యం కడిగిన నీళ్లతో సేవిస్తే పొట్టలోని పలురకాల క్రిములు నశిస్తాయి.