వినియోగదారులు తమ మొబైల్‌ నెంబర్లను మార్చి 31 నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ ఎన్‌ఎల్‌) తెలిపింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే మొబైల్‌ నెంబర్‌ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. వినియోగదారులు సమీపంలోని సిఎ్‌ససి, ఫ్రాంఛైజీ, రిటైలర్‌ వద్ద ఈ ఆధార్‌ అనుసంధాన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే ఐవిఆర్‌ఎస్‌ నంబరు 14546కు డయల్‌ చేసి కూడా వినియోగదారులు తమ మొబైల్‌ నెంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని బిఎ్‌సఎన్‌ఎల్‌ వెల్లడించింది.