రీసెంట్గా నాగచైతన్య, సమంతలు పెళ్లి తర్వాత కలిసి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోన వెంకట్ కథ అందిస్తూ.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చేయడానికి సమంతని చైతూనే ఒప్పించాడనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలు నిజం కాదంటూ తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘నేను చేయబోయే సినిమాలంటూ కొన్ని వార్తలు సంచరిస్తుండటం ఈ రోజే నా నోటీసుకి వచ్చింది. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం సవ్యసాచి, మారుతి దర్శకత్వంలో చేస్తున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నాను. ఈ రెండు చిత్రాలలో చేస్తున్నందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న కథలతో ఈ సంవత్సరం సినిమాలు చేస్తున్నాను. నా తదుపరి సినిమాల గురించి త్వరలో వెల్లడిస్తా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మాత్రమే నిజం. మిగతావేవీ నిజం కాదు..’’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు.
సో.. రియల్ కపుల్.. పెళ్లి తర్వాత రీల్ కపుల్‌గా నటించడం లేదని.. చైతూ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇంతటితో ఈ గాసిప్‌లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.